kcr: పీవీకి, కేసీఆర్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: కోమటిరెడ్డి

  • ఈ ఎన్నికలు మోదీకి, రాహుల్ కి మధ్యే జరుగుతున్నాయి
  • ఈ ఎన్నికలతో కేసీఆర్ చేసేదేమీ లేదు
  • కేసీఆర్ కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పై భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శల తీవ్రతను పెంచారు. ఈ ఎన్నికలు కేవలం ప్రధాని మోదీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నవి మాత్రమేనని చెప్పారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ చేసేది ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని అన్నారు. భువనగిరి ఎంపీగా తాను గెలిస్తే... ఇక్కడ ఐటీ కారిడార్ ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.

 అప్పట్లో పీవీ నరసింహారావే ప్రధాని అయినప్పుడు... ఇప్పుడు కేసీఆర్ ప్రధాని కాలేరా? అంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పీవీకి, కేసీఆర్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ అసలు పోలికే లేదని అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

kcr
pv narasimharao
kavitha
komatireddy
bhuvanagiri
TRS
bjp
congress
  • Loading...

More Telugu News