jagan: పులివెందులలో నామినేషన్ వేసిన జగన్

  • తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించిన జగన్
  • మధ్యాహ్నం 1.49 గంటలకు నామినేషన్
  • జగన్ పై పోటీ చేస్తున్న టీడీపీ నేత సతీష్ రెడ్డి

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జగన్ నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.49 నిమిషాలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు ఆయన సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. అంతకు ముందు సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మరోవైపు, పులివెందులలో జగన్ పై టీడీపీ అభ్యర్థి వెంకట సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

jagan
nomination
ysrcp
pulivendula
  • Loading...

More Telugu News