Rajasthan: కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేసిన వెంకటేశ్!

  • రాజస్థాన్ లో వివాహం
  • సంగీత్ లో సందడి చేయనున్న సమంత, చైతూ
  • ఆపై హైదరాబాద్ లో రిసెప్షన్

తన కుమార్తె అశ్రిత వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను విక్టరీ వెంకటేశ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసిన వెంకీ, ఈ వివాహానికి సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది. హైదరాబాద్ రేస్ క్లబ్ యజమాని సురేందర్ రెడ్డి మనవడితో అశ్రిత నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే వీరిద్దరి వివాహం జరుగనుండగా, సంగీత్ లో రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సమంత తదితరులు సందడి చేయనున్నారని, పెళ్లి తరువాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని దగ్గుబాటి వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News