Congress: ఏపీ ఎన్నికలకు తుది జాబితా ప్రకటించిన కాంగ్రెస్!

  • తొలి జాబితాలో 132 స్థానాలకు అభ్యర్థులు
  • తాజాగా మిగతా స్థానాలకు పేర్లు ఖరారు
  • వెల్లడించిన రఘువీరారెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాలో 132 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, మిగతా స్థానాలను కూడా ఖరారు చేసేసింది. విజయవాడ లోక్ సభకు నరహరశెట్టి నరసింహరావు, విశాఖ నుంచి పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నంద్యాల నుంచి జే లక్ష్మీ నారాయణయాదవ్ పేర్లను రఘువీరారెడ్డి ప్రకటించారు. తమ జాబితాలో అన్ని వర్గాలకూ న్యాయం చేశామని, 110 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీట్లిచ్చామని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి తెలిపారు. మహిళలకు 18 సీట్లు ఇచ్చామని చెప్పారు.

తాజాగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా...

విశాఖపట్నం తూర్పు - విజ్జిపర్తి శ్రీనివాసరావు
విశాఖపట్నం దక్షిణ - హైదర్ ఆది
విశాఖపట్నం ఉత్తరం - గంప గోవిందరాజు
విశాఖపట్నం పశ్చిమ - పిరిడి భగత్
అనకాపల్లి - ఇళ్ల రామచంద్రరావు
పిఠాపురం - మేడిది వెంకట శ్రీనివాసరావు
రామచంద్రాపురం - ఇసుకపట్న సతీశ్ కుమార్
కొత్త పేట - మూసిని రామకృష్ణారావు
భీమవరం - శేఖర్ బాబు దొరబాబు
నూజివీడు - బీడీ రవికుమార్
విజయవాడ పశ్చిమ - రత్నకుమార్
విజయవాడ సెంట్రల్ - వీ గురునాథం
విజయవాడ తూర్పు - పొనుగుపాటి నాంచారయ్య
పెదకూరపాడు - పడిమిడి నాగేశ్వరరావు
తాడికొండ (ఎస్సీ) - చిలక విజయ్ కుమార్
పొన్నూరు - జక్కా నాగశ్రీనివాస వరప్రసాద్
రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
బాపట్ల - మొహిద్దీన్ బేగ్
గుంటూరు పశ్చిమ - సవరం రోహిత్
గుంటూరు తూర్పు - జగన్ మోహన్ రెడ్డి
సత్తెనపల్లి - చంద్రపాల్
వినుకొండ - అట్లూరి విజయ్ కుమార్
పర్చూరు - పొన్నగంటి జానకీరామ్
చీరాల - దేవరపల్లి రంగారావు
కందుకూరు - చిలకపాటి సుశీల
నెల్లూరు సిటీ - షేక్ ఫయాజ్
గూడూరు (ఎస్సీ) - పీ వెంకటేశ్వరరావు
సూళ్లూరుపేట (ఎస్సీ) - చందనమూడి ఈశ్వరయ్య
వెంకటగిరి - పెంటా శ్రీనివాసరెడ్డి
ఉదయగిరి - దుద్దుకూరి రమేశ్
రాజంపేట - పూల విజయభాస్కర్
కడప - నజీర్ అహ్మద్
మైదుకూరు - మల్లికార్జునమూర్తి
కర్నూలు - జాన్ విల్సన్
ఆలూరు - డీ ఆశాబేగం
గుంతకల్లు - కావలి ప్రభాకర్
అనంతపురం అర్బన్ - జీ నాగరాజు
పీలేరు - ఖాతిబ్ సయ్యద్ మోహిద్దీన్
మదనపల్లె - డీ మోహన్ రాణిరెడ్డి
పుంగనూరు - ఎస్ సైఫానదీముద్దీన్
తిరుపతి - కిడాంబి ప్రమీల
సత్యవేడు (ఎస్సీ) - పెనుబాల చంద్రశేఖర్
నగరి - రాకేశ్ రెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - గౌడపేరు చిట్టిబాబు
పలమనేరు - తిప్పిరెడ్డిగారి పార్థసారథి రెడ్డి

Congress
Andhra Pradesh
Final List
Elections
  • Loading...

More Telugu News