Social Media: కొలంబియాలో విడ్డూరం... అప్పుడే పుట్టిన ఆడ శిశువుకు గర్భం!

  • శిశువు గర్భంలో మరో పిండం
  • కవలలుగా భావిస్తున్న వైద్యులు
  • వైద్యచరిత్రలో అరుదైన ఘటన

సాధారణంగా స్త్రీ గర్భాశయంలో రెండు పిండాలు ఏర్పడడం వల్ల కవలలు జన్మిస్తుంటారు. కానీ, కొలంబియాలోని ఓ మహిళకు ప్రసవం నిర్వహించిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె గర్భంలో కూడా రెండు పిండాలు ఉన్నాయి కానీ, వాటిలో ఒక పిండం మరో పిండం లోపల ఏర్పడింది. ప్రసవం తర్వాత ఆమెకు పుట్టిన ఆడశిశువు కూడా గర్భవతేనని గుర్తించి డాక్టర్లు విస్మయానికి గురయ్యారు.

కొలంబియాకు చెందిన మోనికా వెగా అనే 33 ఏళ్ల యువతి అందరిలానే గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో ప్రసవిస్తుందనగా, ఆమెకు వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్, కలర్ డాప్లర్ టెస్టులు నిర్వహించారు. గర్భాశయం లోపల పిండంతోపాటే కొంత అసాధారణ స్థితి ఉన్నట్టు గుర్తించారు. దాంతో, శస్త్రచికిత్స నిర్వహించి మోనికాకు ప్రసవం చేశారు. అయితే, బయటికొచ్చిన శిశువు గర్భంలో మరో పిండం ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే ఆ పిండం అసంపూర్తిగా ఉండడంతో మొదట పుట్టిన శిశువుకు కూడా సర్జరీ నిర్వహించి ఆ పిండాన్ని తొలగించారు. సామాజిక మాధ్యమంలో ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News