Telangana: నాకు టికెట్ ఇవ్వకపోవడంపై సమాధానం నా దగ్గర లేదు: సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి

  • టీఆర్ఎస్ లోనే కొనసాగుతా
  • కేసీఆర్ సొంత తమ్ముడిగా చూసుకున్నారు
  • ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను కొద్ది సేపటి క్రితం ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న జితేందర్ రెడ్డికి మాత్రం మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ విషయమై ప్రశ్నించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. మళ్లీ ఎంపీగా తనకు టికెట్ ఇవ్వకపోవడంపై సమాధానం తన వద్ద లేదని చెప్పిన జితేందర్ రెడ్డి, కేసీఆర్ తనను సొంత తమ్ముడిగా చూసుకున్నారని, ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 

Telangana
TRS
MP
Jitender Reddy
kcr
cm
  • Loading...

More Telugu News