Andhra Pradesh: బీజేపీ తొలి జాబితా: ఏపీ నుంచి పురందేశ్వరి, కన్నా.. తెలంగాణలో డీకే అరుణకు దక్కిన ఛాన్స్!

  • విశాఖపట్టణం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి
  • నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ
  • తొలి జాబితాలో  సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు దక్కని ఛాన్స్

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా ఆ జాబితాను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్థుల వివరాలను ఆయన ప్రకటించారు. ఏపీ నుంచి రెండు స్థానాలకు మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించారు. విశాఖపట్టణం నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

తెలంగాణ నుంచి.. 

కరీంనగర్- బండి సంజయ్,
నిజామాబాద్-డి. అరవింద్
మల్కాజ్ గిరి- ఎన్. రామచంద్రరావు
సికింద్రాబాద్- జి.కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్-డీకే అరుణ  
నాగర్ కర్నూల్- బంగారు శ్రుతి
నల్గొండ- జితేంద్ర కుమార్
భువనగిరి- పీవీ  సుందర్ రావు
వరంగల్- చింతా సాంబమూర్తి
మహబూబాబాద్- హుస్సేన్ నాయక్  

Andhra Pradesh
Telangana
BJP
kishan reddy
  • Loading...

More Telugu News