Andhra Pradesh: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..వారణాసి నుంచే మోదీ!

  • 184 మంది లోక్ సభ అభ్యర్థులతో జాబితా 
  • వారణాసి నరేంద్ర మోదీ
  • గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అమిత్ షా

బీజేపీ తన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత జేపీ నడ్డా ఆ జాబితాలో అభ్యర్థుల పేర్లను చదవి వినిపించారు. 184 మంది లోక్ సభ అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి నరేంద్ర మోదీ రెండోసారి పోటీ చేయనున్నారు. లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్, నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అమిత్ షా, మథుర నుంచి హేమమాలిని పోటీ చేస్తున్నారు.

Andhra Pradesh
BJP
Mp candidates
List
  • Loading...

More Telugu News