nani: 'జెర్సీ' నుంచి 'అదేంటో గానీ ఉన్నపాటుగా . .' సాంగ్ టీజర్

  • క్రికెటర్ గా కనిపించనున్న నాని 
  • ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ 
  • ఏప్రిల్ 19వ తేదీన విడుదల    

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'జెర్సీ' సినిమా రూపొందింది. నాని క్రికెటర్ గా నటించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, 'హోలీ' పండగ సందర్భంగా ఒక సాంగ్ టీజర్ ను వదిలారు. 'అదేంటో గాని ఉన్నపాటుగా ..' అనే సాంగ్ పై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంటుంది.

అక్కడక్కడా ఫీల్ తో కూడిన డైలాగ్స్ ను కూడా యాడ్ చేయడంతో టీజర్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నాని వున్నాడు. తెలుగులో తన కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందని శ్రద్ధా శ్రీనాథ్ భావిస్తోంది. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి

nani
shraddha srinath
  • Error fetching data: Network response was not ok

More Telugu News