adinarayana reddy: డాక్టర్ ను పిలిపించి శవానికి కుట్లు వేయించారు: ఆదినారాయణరెడ్డి

  • జగన్, అవినాశ్ కనుసన్నల్లోనే వివేకా హత్య జరిగింది
  • హత్య జరిగినట్టు క్లియర్ గా కనపడుతుంటే.. గుండెపోటు అని ప్రచారం చేశారు
  • ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లా?

వైయస్ వివేకా హత్య కేసుపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. హత్యతో తనకు సంబంధం ఉన్నట్టు తేలితే నడిరోడ్డులో తనను రాళ్లతో కొట్టి చంపాలని అన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన శవాన్ని బాత్రూమ్ కు తరలించి, ఇంట్లోని రక్తాన్ని తుడిచేసి, డాక్టర్ ను పిలిపించి శవానికి కుట్లు వేశారని తెలిపారు. శరీరం మొత్తానికి గుడ్డ చుట్టారని చెప్పారు. ఆ తర్వాత గుండెపోటుతో వివేకా చనిపోయారంటూ బ్రేకింగ్ న్యూస్ ను వదిలారని అన్నారు.

జగన్, అవినాశ్ రెడ్డిల కనుసన్నల్లోనే వివేకా హత్య జరిగిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. కేసుకు సంబంధించి సీబీఐ విచారణను కోరడం విడ్డూరంగా ఉందని చెప్పారు. హత్య జరిగినట్టు క్లియర్ గా కనపడుతుంటే గుండెపోటు అని ప్రచారం చేశారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లనుకున్నారా? అని అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురావాలని యత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని... రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

adinarayana reddy
jagan
avinash reddy
viveka
ys
ysrcp
Telugudesam
chandrababu
  • Loading...

More Telugu News