kashmir: కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని సూచించిన సల్మాన్ ఖాన్

  • యువతకు సరైన విద్యను అందించాలి
  • పుల్వామా దాడికి పాల్పడింది ఓ ఇంజినీరింగ్ విద్యార్థి
  • కానీ, అతనికి ట్యూటర్లు సరైన పద్ధతిలో చదువు చెప్పలేదు

కశ్మీర్ లో కొనసాగుతున్న హింసకు ముగింపు పలకాలంటే ఏం చేయాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూచించారు. కశ్మీర్ యువతకు సరైన విద్యను అందిస్తే... అక్కడి పరిస్థితి చక్కబడుతుందని అన్నారు. తను నిర్మిస్తున్న 'నోట్ బుక్' చిత్రం ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కశ్మీర్ అంశంపై సల్మాన్ కు మీడియా ప్రశ్నలు వేసింది. సరైన విద్యను అందిస్తే సమస్య పరిష్కారమవుతుందా? అని అడగ్గా... కచ్చితంగా సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. 'ఇటీవల జరిగిన పుల్వామా దాడికి పాల్పడింది ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. అతను విద్యను అభ్యసించినప్పటికీ... అతనికి ట్యూటర్లు సరైన పద్ధతిలో చదువు చెప్పలేదు. సరైన విద్యను అందిస్తే అక్కడి యువతలో మార్పు కచ్చితంగా వస్తుంది' అని తెలిపాడు. 

kashmir
issue
solution
Salman Khan
bollywood
  • Loading...

More Telugu News