Andhra Pradesh: ఏపీ రైతులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ!

  • 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం
  • ఆర్బీఐ, కేంద్రం సహకరించకున్నా రుణమాఫీ చేపట్టాం
  • జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగాన్ని ధ్వంసం చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తోందని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు తెలిపారు. భారత్ 6.9 అభివృద్ధిని నమోదుచేస్తే, ఏపీ 11.5 శాతం అభివృద్ధిని నమోదుచేసిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఏపీ ముందుకు దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు కళా వెంకట్రావు ఈరోజు బహిరంగ లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకరించకున్నా ఏపీ ప్రభుత్వం 60 లక్షల మంది రైతులకు రూ.24,000 కోట్ల రుణమాఫి చేసిందని కళా వెంకట్రావు తెలిపారు. అలాగే ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. ఏపీలో రైతుల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
farmers
Telugudesam
kala venkatrao
  • Loading...

More Telugu News