sivajiraja: వైసీపీ గూటికి 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్?

  • త్వరలోనే పార్టీలో చేరే అవకాశం
  • ఈ నెల 24న నరసాపురంలో జగన్‌ పర్యటనలో కండువా
  •  నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం 

మూవీ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీరాజా రాజకీయ రంగప్రవేశం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన వైసీపీ అధినేత జగన్‌ నర్సాపురం లోక్‌సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో  ఆయన నరేష్‌పై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి సోదరుడు నాగబాబు, శివాజీరాజా మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయన్న చర్చ సాగింది.

ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడిన శివాజీరాజా త్వరలోనే నాగబాబుకు రిటర్న్‌ గిప్ట్‌ ఇస్తానని చాలెంజ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా శివాజీరాజాను వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి రఘురామరాజు తరపున శివాజీరాజా ప్రచారం చేసే అవకాశం ఉంది.

sivajiraja
YSRCP
narsapuram
nagababu
  • Loading...

More Telugu News