Andhra Pradesh: చీరాలలో నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత కరణం బలరాం!

  • తొలుత వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
  • భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి నామినేషన్
  • ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి రామారావు హాజరు

టీడీపీ నేత, చీరాల అభ్యర్థి కరణం బలరాం ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత చీరాలలోని అమరావారి వీధిలోని వినాయక ఆలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో బలరాం కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ సంఖ్యలో అనుచరులు వెంటరాగా, చీరాలలోని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

కరణం జయరాం వెంట ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు, కరణం వెంకటేశ్ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కరణం బలరాం మీడియాతో మాట్లాడుతూ.. చీరాల నుంచి ఈసారి భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మరోసారి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Prakasam District
chirala
karanam balaram
Telugudesam
nominations
  • Loading...

More Telugu News