chaitu: 'మజిలీ' కోసం తమన్ ను రిక్వెస్ట్ చేసిన సమంత

  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • రీ రికార్డింగ్ తమన్ చేతికి
  •  ఏప్రిల్ 5న సినిమా రిలీజ్    

నాగచైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా నిర్మితమైంది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆడియోకి మంచి పేరు వచ్చింది. అయితే ఎక్కడ తేడా వచ్చిందో తెలియదుగానీ, రీ రికార్డింగ్ చేయడం మాత్రం కుదరదని చెప్పేశాడట.

రీ రికార్డింగ్ చేస్తానని చెప్పి దానికి కూడా డబ్బు తీసుకున్న ఆయన, ఇలా చివరి నిమిషంలో చేయనని చెప్పడంతో తమన్ ను సంప్రదించి ఒప్పించారట. అయితే సమయం తక్కువగా ఉండటంతో .. తమన్ కి సమంత ఓ మెసేజ్ పెట్టిందట. పెళ్లి తరువాత తాను చైతూ కలిసి చేసిన సినిమా ఇదనీ .. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మంచి రీ రికార్డింగ్ తో సినిమాను నిలబెట్టే బాధ్యత ఆయనదేననీ .. ఎక్కడా ఫీల్ మిస్సవకుండా చూడమని రిక్వెస్ట్ చేసిందట. ప్రస్తుతం తమన్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు.

chaitu
samanta
  • Loading...

More Telugu News