Andhra Pradesh: దళితులు, ఎస్టీలు మనుషులు కాదా.. కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా?: పోసాని కృష్ణమురళి

  • చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది
  • ఎవరైనా కర్మతోనే వెధవ అవుతాడు, కులంతో కాదు
  • కమ్మవారే పదవులకు పనికివస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులపిచ్చి ఉందనీ, కులగజ్జి ఉందని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు. చంద్రబాబుకు కులపిచ్చి ఉన్నట్లు తాను చెప్పకున్నా చెప్పినట్లు ఏబీఎన్ రాధాకృష్ణ వార్తలు రాశారనీ, ఇప్పుడు చంద్రబాబుకు కులపిచ్చి ఉందని తాను చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు.. అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ ను పోసాని ప్రదర్శించారు.

‘అంటే ఎస్టీ కులంలో, దళితులుగా పుట్టినవారు మనుషులు కాదా? కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా? నువ్వు కమ్మవాడివి కాబట్టి అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు. కర్మతో ఎవడైనా వెధవ అవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ స్పృహ కూడా చంద్రబాబుకు లేదా? అందుకే ఆయనకు కులపిచ్చి ఉందని చెప్పాను’ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను పోసాని ప్రదర్శించారు. ఏ ఎమ్మెల్యే అయినా ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు?’ అంటాడా అని ప్రశ్నించారు. రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఓటున్న ప్రతీఒక్కరికీ కావాలని తెలిపారు. దళితులు సర్వీసులకు పనికిరారా? కేవలం కమ్మకులంలో పుట్టినవారే పదవులకు పనికివస్తారా? అని నిలదీశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Posani Krishna Murali
  • Loading...

More Telugu News