Tamilnadu: పేపర్ చదువుతుండగా గుండెపోటు.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా చనిపోయిన ఎమ్మెల్యే!

  • తమిళనాడులోని చెన్నైలో ఘటన
  • కనగరాజ్ సూలూరు ఎమ్మెల్యే 
  • వార్తాపత్రిక చదువుతుండగా కనగరాజ్ కు గుండెపోటు 

పేపర్ చదువుతుండగా గుండెపోటు రావడంతో ఓ ఎమ్మెల్యే అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

అన్నాడీఎంకే నేత కనగరాజ్ సూలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో చెన్నైలోని తన ఇంట్లో కనగరాజ్ ఈరోజు పేపర్ చదువుతుండగా గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కనగరాజ్ ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. 

Tamilnadu
chennai
mla
aiadmk
dead
kanagaraj
heart attack
  • Loading...

More Telugu News