Karnataka: కర్ణాటకలో దారుణం...స్వాతంత్య్ర సమరయోధుడు కుమారుడి హత్య

  • రాత్రి ఇంటికి వెళ్తుండగా తుపాకీతో కాల్పులు
  • ఆర్థిక వ్యవహారాలే కారణమని అనుమానం
  • మృతుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు

కర్ణాటకలో ఘోరం జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే పరశురాం బాబు కుమారుడు అరుణ్‌ నందిహల్లి (50)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన నంది హల్లి బుధవారం రాత్రి తన కారులో ఇంటికి వస్తుండగా దామణి గ్రామం వద్ద దుండగులు అతన్ని అడ్డుకున్నారు. అనంతరం తుపాకీతో దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన స్థానికులు కారు వద్దకు చేరుకుని తీవ్రంగా గాయపడిన నందిహల్లిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నందిహల్లి మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. కాగా, ఆర్థిక వ్యవహారాలే నందిహల్లి హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Karnataka
freedom fighter son shot dead
damani
  • Loading...

More Telugu News