Jagan: నేడు పవన్ నామినేషన్... మేనిఫెస్టో ఖరారులో జగన్.. ఫుల్ బిజీ!

  • నేడు నామినేషన్ వేయనున్న పవన్
  • ఆపై వరుసగా బహిరంగ సభలు
  • మేనిఫెస్టో కమిటీతో భేటీ అయిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నేడు బిజీగా గడపనున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్న ఆయన, నేడు తన నామినేషన్‌ ను దాఖలు చేయనున్నారు. మరికాసేపట్లో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన, నేరుగా జీవీఎంకు వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఆపై 11 గంటలకు పాత గాజువాకలో బహిరంగ సభ నిర్వహించి, ప్రజలతో మాట్లాడతారు. భోజన విరామం తరువాత, మధ్యాహ్నం మూడింటికి ఆనందపురం పూల మార్కెట్‌ వద్ద, సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద జరిగే సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

ఇక వైఎస్ జగన్ రేపు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. పార్టీ మేనిఫెస్టోకు తుదిరూపును ఇచ్చే పనిని నేడు పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ప్రచారానికి కూడా విరామం ప్రకటించారు. నేడంతా మ్యానిఫెస్టో కమిటీతో సమావేశం కానున్న జగన్, రేపు నామినేషన్ వేసిన తరువాత, పులివెందులలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, ఆపై తిరిగి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లనున్నారు.

Jagan
Pawan Kalyan
Manifesto
Elections
Nomination
  • Loading...

More Telugu News