Kings XI Punjab: పుల్వామా అమరుల కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం రూ.25 లక్షల సాయం
- పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లు
- పంజాబ్‌కు చెందిన ఐదు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం
- చెక్కులు అందించిన కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్
పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు చేయూత అందించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు జవాన్లు ఉన్నారు. ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది.
ఈ మేరకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్.. సీఆర్‌పీఎఫ్ డీఐజీ వీకే కౌండల్‌తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. పాకిస్థాన్‌కు ఉగ్రవాది మసూద్ అజర్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి వ్యూహ రచన చేసింది.