KCR: కేసీఆర్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు.. కేసు నమోదు

  • కరీంనగర్ సభలో బీజేపీపై విరుచుకుపడిన కేసీఆర్
  • కేసీఆర్ చేసిన ‘మేమూ హిందువులమే’ వ్యాఖ్యలకు పెడార్థాలు
  • సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వ్యక్తిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఒక్కటే హిందువుల కోసం పాటుపడుతున్నట్టు భ్రమపడుతోందని ఎద్దేవా చేశారు. తామూ హిందువులమేనని, గుళ్లూగోపురాలకు వెళ్తామని, చస్తే తద్దినాలు పెట్టుకుంటామని పేర్కొన్నారు.

కేసీఆర్ చేసిన ‘మేమూ హిందువులమే’ అన్న వ్యాఖ్యలకు పెడార్థాలు తీస్తూ విలాసాగర్ సాయికుమార్ అనే వ్యక్తి కేసీఆర్‌ను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు సాయికుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

KCR
BJP
Hindu
Karimnagar District
Social Media
Telangana
  • Loading...

More Telugu News