Saico: బాసర సరస్వతీ ఆలయంలో సైకో హల్ చల్!

  • బ్లేడ్ తో ఆలయంలోకి ప్రవేశించిన సైకో
  • ఒంటిపై గాయాలు చేసుకుంటూ బీభత్సం
  • పరుగులు పెట్టిన భక్తులు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలోకి ఈ ఉదయం ఓ సైకో ప్రవేశించి దారుణంగా ప్రవర్తించాడు. ఓ బ్లేడ్ తీసుకుని ఆలయంలోకి వచ్చిన వ్యక్తి, ఒంటిపై గాయాలు చేసుకుంటూ భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. అతని చర్యలు చూసిన భక్తులు ఆందోళనతో పరుగులు తీశారు.

భద్రతా సిబ్బంది వైఫల్యంతోనే సైకో ఆలయంలోకి ప్రవేశించాడని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన వేళ, తన దగ్గరకు వస్తే సూసైడ్ చేసుకుంటానని ఆ సైకో బెదిరింపులకు దిగాడు. అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, ఆలయం వెలుపలికి తీసుకెళ్లారు. అతను నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Saico
Saiko
Basara
Blade
Police
  • Loading...

More Telugu News