Bonda Uma: బొండా ఉమకు శుభం కలగాలని ఆవును తెస్తే..!

  • విజయవాడ సెంట్రల్ నుంచి బరిలో ఉన్న బొండా ఉమ
  • అవును ఎదురు పంపాలని భావించిన కార్యకర్తలు
  • ఆవు బెదరగా, పరుగులు తీసిన ఉమా భార్య, బంధువులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న తెలుగుదేశం నేత బొండా ఉమ, నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్న వేళ, అందరూ పవిత్రంగా భావించే ఆవు ఎదురుగా వచ్చేలా చూస్తే, మేలు కలుగుతుందని అనుకున్న తెలుగు తమ్ముళ్లు ఎక్కడి నుంచో ఓ అవును తేగా, అది వీళ్ల హడావుడికి బెదిరి, ఎదురుతిరిగి పరుగులు పెట్టింది.

ప్రజలంతా లక్ష్మీదేవిగా భావించే గోవును తెచ్చిన బొండా ఉమ మద్దతుదారులు, అది ఆయనకు ఎదురు వెళ్లేలా చూడాలని భావించారు. అయితే, వారందరి గోలకు అది అదిరిపోయింది. ఆవు పరుగులు పెడుతుంటే బొండా ఉమ భార్య, ఆయన బంధువులు కూడా పరుగులు తీయాల్సివచ్చింది. ఎలాగైతేనేం, చిట్టచివరకు తెలుగుతమ్ముళ్లు ఆవును గట్టిగా పట్టుకుని, ఉమ బయలుదేరిన వాహనానికి ఎదురుగా తీసుకెళ్లి, తమ ముచ్చట తీర్చుకున్నారు.

Bonda Uma
Cow
Vijayawada Central
Telugudesam
  • Loading...

More Telugu News