TTD: పోటీకి అడ్డం వస్తుందని.. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవికి పుట్టా రాజీనామా?

  • మైదుకూరు నుంచి పోటీ పడుతున్న సుధాకర్ యాదవ్
  • ఇప్పటికే రాజీనామా చేసిన పార్థసారథి, బోండా ఉమా, రాయపాటి
  • పుట్టా కూడా చేస్తే ధర్మకర్తల మండలి రద్దు

కడప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. నిజానికి బుధవారమే ఆయన రాజీనామా చేయాలని భావించినప్పటికీ మంత్రి ఒకరు వారించడంతో వెనక్కి తగ్గారు. అయితే, నామినేషన్ల పరిశీలన సమయంలో ఆ పదవి ఆటంకంగా మారే పరిస్థితి కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా పదవిని వదులుకోవాలని ఆయన భావిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఉన్న బీకే పార్థసారథి, బోండా ఉమామహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావులు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ యాదవ్ కూడా రాజీనామా చేస్తే ధర్మకర్తల మండలి పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ధర్మకర్తల మండలి లేనట్టే.  

TTD
Putta sudhakar yadav
mydukuru
Kadapa District
Telugudesam
  • Loading...

More Telugu News