చంద్రబాబుపై నటుడు పోసాని అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం
- చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ వ్యాఖ్యలు
- వివరణ ఇవ్వాలంటూ పోసానికి ఈసీ ఆదేశాలు
- తాను నడవలేని స్థితిలో ఉన్నానంటూ పోసాని లేఖ
నోటీసులు అందుకున్న పోసాని వెంటనే స్పందించి లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసాని పేర్కొన్నారు.