Yogi Adityanath: 45 స్థానాలపై స్పష్టత, మరోసారి వారణాసి నుంచి మోదీ పోటీ!

  • అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు
  • మోదీ అధ్యక్షతన సమావేశం
  • లక్నో నుంచి రాజ్‌నాథ్ పోటీ
  • మధుర నుంచి హేమమాలిని  

అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు జరుగుతోంది. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో యూపీలో 80 స్థానాలకు గాను, 45 స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనుండగా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి లక్నో నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మధుర నుంచి హేమమాలిని, అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీ పడనున్నట్టు సమాచారం.

Yogi Adityanath
Rajnath Singh
Sushma Swaraj
Amith Shah
Hema Malini
Varanasi
Madhura
  • Loading...

More Telugu News