Andhra Pradesh: రేపు దేవాన్ష్ పుట్టినరోజు.. తిరుమల చేరుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులు

  • తిరుమలకు చేరుకున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్
  • దేవాన్ష్ పేరిట రేపు అన్నదాన కార్యక్రమం
  • అన్నదానానికి అయ్యే ఒకరోజు ఖర్చు రూ.30 లక్షలు

ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు రేపు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబం శ్రీవారి సేవలో గడపనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, దేవాన్ష్ తిరుమలకు చేరుకున్నారు. దేవాన్ష్ పేరిట రేపు తిరుమలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్నదానానికి అయ్యే ఒకరోజు ఖర్చు రూ.30 లక్షలను చంద్రబాబు పంపినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీవారు విహరింపజేసే కార్యక్రమం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ వార్షిక తెప్పోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి. 

Andhra Pradesh
Chandrababu
Devansh
Brahmani
  • Loading...

More Telugu News