జగన్‌కు చదువు రాదు కాబట్టే పీకేపై ఆధారపడ్డారు: నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
- పీకే రాజకీయ నాయకుడు కాదు
- డేటాను విదేశీయుల చేతుల్లో పెడుతున్నారు
- డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్
- పీకేను నమ్మటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు
ప్రజల డేటాను తీసుకెళ్లి పీకే విదేశీయుల చేతుల్లో పెడుతున్నారని, డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని శివాజీ విమర్శించారు. పీకేని వ్యాహకర్తగా అభివర్ణించడం పెద్ద తప్పని, ఆయన్ను నమ్ముకోవడం జగన్ చేసిన అతి పెద్ద తప్పన్నారు. వైసీపీపై బీజేపీ, టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయని శివాజీ విమర్శించారు. సర్వేల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్‌ను గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని శివాజీ ఆరోపించారు.