TRS: రేపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

  • అభ్యర్థుల ఎంపికపై స్పీడు పెంచిన టీఆర్ఎస్
  • ప్రగతి భవన్‌లో కొందరు ఎమ్మెల్యేలతో భేటీ
  • ఖమ్మం లోక్‌సభ స్థానంపై తీవ్ర ఉత్కంఠ

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్ టికెట్ ఆశావహుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ స్పీడు పెంచింది. రేపు అభ్యర్థులను ప్రకటించనుంది. నేడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కొందరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎంపీల మార్పు విషయమై ఎమ్మెల్యేలతో కేసీఆర్ ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది.

వరంగల్, మెదక్, ఆదిలాబాద్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్ సిట్టింగ్‌ల విషయంలో ఏ మార్పూ ఉండదని మాత్రం తెలుస్తోంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని, మహబూబ్‌నగర్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టనున్నట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం లోక్‌సభ స్థానంపై కూడా తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది.

TRS
KCR
Khammam
Pragathi Bhavan
Adilabad
Bhuvanagiri
Warangal
  • Loading...

More Telugu News