Vijayawada: ఏడుగురి ప్రాణాలు హరించిన వ్యక్తి నాపై పోటీనా?: మల్లాది విష్ణు పై బొండా ఉమా ఫైర్

  • నకిలీ మద్యం కేసులో ఏడుగురు ప్రాణాలు తీసిన వ్యక్తి
  • నాపై పోటీకి ఆయన దిగడం విడ్డూరంగా ఉంది
  • వైసీపీ ఎంపీ స్థానానికి ఓ క్రిమినల్ గ్యాంగ్ రంగంలోకి దిగింది

విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లాది విష్ణుపై అదే స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న బొండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ మద్యం కేసులో ఏడుగురి ప్రాణాలు హరించిన వ్యక్తి మల్లాది విష్ణు తనపై పోటీకి దిగడం విడ్డూరంగా ఉందని అన్నారు. విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ తరపున మరో క్రిమినల్ గ్యాంగ్ రంగంలోకి దిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎలా ఉన్నారో, ఆ పార్టీ అభ్యర్థులు కూడా అలానే ఉన్నారని, ఈ విషయాలను ప్రజలు గమనించి సరైన పార్టీకే ఓటు వేయాలని కోరారు.

Vijayawada
Telugudesam
budha venkanna
YSRCP
malladi
vishnu
jagan
criminal gang
  • Loading...

More Telugu News