TRS: బీజేపీపై టీఆర్ఎస్, ఎంఐఎం స్టాండ్ ఏంటో చెప్పాలి: భట్టి

  • మోదీ ప్రధాని కావటం ఎంఐఎంకి ఇష్టమేనా?
  • కేసీఆర్‌కి మద్దతుగా ఎంఐఎం
  • బీజేపీకి కేసీఆర్ సంపూర్ణ మద్దతు

బీజేపీతో టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, బీజేపీతో విభేదిస్తూనే టీఆర్ఎస్‌తో ఎంఐఎం జత కట్టడాన్ని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీపై టీఆర్ఎస్, ఎంఐఎంల స్టాండ్ (వైఖరి) ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి కేసీఆర్ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంటే, ఎంఐఎం కేసీఆర్‌కి మద్దతుగా నిలుస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎంఐఎం మద్దతివ్వడమంటే పరోక్షంగా మోదీ మరోసారి ప్రధాని కావడం ఆ పార్టీకి ఇష్టమేనా? అని భట్టి ప్రశ్నించారు.

TRS
BJP
MIM
Mallu Bhatti Vikramarka
KCR
Narendra Modi
  • Loading...

More Telugu News