Andhra Pradesh: నాడు ‘కాంగ్రెస్’కు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నేడు వైసీపీకి ఇద్దాం: సీఎం చంద్రబాబు

  • 2014లో ‘కాంగ్రెస్’కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం
  • వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి
  • ఆ పార్టీ నేతలకు డిపాజిట్లు రాకుండా చేయాలి

రాష్ట్ర విభజన చేసి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీకి 2014లో జరిగిన ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు కూడా రాలేదని, ఆ పార్టీకి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లాలోని నూజివీడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చేసి తప్పు చేశామని కాంగ్రెస్ పార్టీ తెలుసుకుందని అన్నారు.

విభజన చట్టంలో మనకు అన్యాయం చేసిన వ్యక్తి, ఆంధ్ర ప్రజలను అనునిత్యం అవమానించే వ్యక్తి, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తికి జగన్ లొంగిపోయారని విమర్శించారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఈ రోజున వైసీపీకి ఇవ్వాలా? వద్దా? అని ఏపీ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఏపీ ఓటర్లకు పిలుపు నిచ్చారు.

Andhra Pradesh
Krishna District
nuzividu
cm
Chandrababu
YSRCP
jagan
bjp
modi
kcr
  • Loading...

More Telugu News