shankar: మరోసారి శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్?

  • శంకర్ తో మూడు సినిమాలు 
  • కమల్ ప్రాజెక్టుపై శంకర్ 
  • మురుగదాస్ తో సెట్స్ పైకి 

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ మరో సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్లో 'శివాజీ, రోబో, 2.ఓ' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక రాజకీయాలపై రజనీకాంత్ పూర్తి దృష్టి పెట్టే అవకాశాలు ఉండటం వలన, ఈ కాంబినేషన్లో మరో సినిమా రావడం జరగదనే అంతా అనుకున్నారు. కానీ శంకర్ .. రజనీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రజనీ ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత సినిమాను శంకర్ తో చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు. పూర్తి సందేశాత్మక చిత్రంగా ఇది రూపొందుతుందని చెబుతున్నారు. ఇదే తన చివరి చిత్రంగా ప్రకటించాలనే ఆలోచనలో రజనీ వున్నారని చెప్పుకుంటున్నారు. ఇక 'భారతీయుడు 2' తన చివరి చిత్రమని ఆల్రెడీ కమల్ చెప్పేశారు. అలాగే జరిగితే ఇద్దరు మహానటుల చివరి చిత్రాలు చేసిన దర్శకుడిగా శంకర్ కి ఒక అరుదైన రికార్డు దక్కుతుంది.

shankar
rajani
kamal
  • Loading...

More Telugu News