Andhra Pradesh: వైఎస్ వివేకాను ఎవరు హత్యచేశారో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది!: టీడీపీ నేత వర్ల రామయ్య

  • శవరాజకీయాలకు వైసీపీ కేరాఫ్ గా మారింది
  • వివేకా మరణంతో సానుభూతి పొందేందుకు జగన్ యత్నం
  • సిట్ పై సునీతకు ఉన్న నమ్మకం జగన్ కు లేదని విమర్శ

ఆంధ్రప్రదేశ్ లో శవరాజకీయాలకు వైసీపీ కేరాఫ్ గా మారిపోయిందని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. గతంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, ఇప్పుడు చిన్నాన్న వివేకానందరెడ్డి మరణం ద్వారా సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వివేకా హత్యకేసులో సిట్ విచారణపై సోదరి సునీతకు ఉన్న నమ్మకం జగన్ కు లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తన తండ్రి వివేకానందరెడ్డి మరణాన్ని రాజకీయం చేయొద్దని సునీత కోరిన విషయం వాస్తవం కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకాను ఎవరు హత్య చేశారో మరికొన్ని గంటల్లో తేలిపోతుందని స్పష్టం చేశారు. జగన్ శవరాజకీయం చేస్తున్నాడనే సునీత వేడుకుందని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
varla ramaiah
YSRCP
Jagan
viveka
sunitha
  • Loading...

More Telugu News