Guntur District: జగన్ కి ఓ అవకాశమివ్వాలట.. ఇదేమన్నా పేకాట ఛాన్సా?: మంత్రి నారా లోకేశ్ సెటైర్

  • జగన్ ది ఏం డ్రామా, ఏం నటన! 
  • సినీ నటుడు అయితే ఆయనకు ‘ఆస్కార్’ ఇవ్వొచ్చు
  • ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల జీవితం ఆయన చేతిలో పెట్టాలట

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ‘ఏం డ్రామా, ఏం నటన, వాస్తవంగా జగన్ గారు మూవీ స్టార్ అయితే, ఏకంగా ఆస్కార్ అవార్డులివ్వొచ్చు. వివేకానందరెడ్డి గారిని కొంత మంది దారుణంగా హత్య చేశారు. ఆరోజున టీవీ స్క్రోలింగ్ లో ఆయన గుండెపోటుతో మరణించారని చూశాను. అయ్యో, పాపం మంచాయన అనుకున్నాను. సొంత కుటుంబ సభ్యులు హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని చూడటం ఎంత దారుణం. జగన్ మోహన్ రెడ్డి గారు తనకో అవకాశమివ్వాలని పదేపదే అంటున్నారు. ఇదేమన్నా పేకాట ఛాన్సా ఇవ్వడానికి? ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల జీవితం. పొరపాటున వాళ్లు గెలిస్తే మనల్ని బతికించే పరిస్థితులు ఉండవు. దయచేసి, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి’ అని సూచించారు.

Guntur District
Mangalagiri
Telugudesam
Nara Lokesh
YSRCP
jagan
ys
viveka
  • Loading...

More Telugu News