Andhra Pradesh: వైసీపీ నేత బాలనాగిరెడ్డిని అరెస్ట్ చేయవద్దు.. స్టే ఆర్డర్ ఇచ్చిన ఏపీ హైకోర్టు!

  • మంత్రాలయంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల ఘర్షణ
  • టీడీపీ నేత తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయం
  • మాదవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేత

వైసీపీ నేత, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఊరట లభించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఖగ్గల్ గ్రామంలో ఇటీవల వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ కేసులో బాలనాగిరెడ్డిని అరెస్ట్ చేయరాదని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఖగ్గల్ గ్రామంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ నేత తిక్కారెడ్డిని బాలనాగిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తిక్కారెడ్డి గన్ మెన్ కాల్పులు జరపగా, ఓ బుల్లెట్ తిక్కారెడ్డి కాలులో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బాలనాగిరెడ్డిపై తిక్కారెడ్డి ఇక్కడి మాదవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమపై అక్రమంగా కేసు పెట్టారని బాలనాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం బాలనాగిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News