Andhra Pradesh: అవన్నీ చూసి నాకు ఓటెయ్యండి: సీఎం చంద్రబాబు

  • వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నా
  • సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా
  • మీ బంగారు భవిష్యత్తు కోసం నాకు ఓటెయ్యండి

ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటు వేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబునాయుడు దీటుగా సమాధానమిచ్చారు. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయాలో స్పష్టం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నందుకు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు, రైతులను, మహిళలను, నిరుద్యోగ యువతను ఆదుకుంటున్నందుకు తమ పార్టీకి ఓటెయ్యాలని వివరించారు. ‘మీ బంగారు భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, వారి బిడ్డల కోసం నాకు ఓటెయ్యండి. మీ భవిష్యత్తు, నా బాధ్యత’ అని తన ట్వీట్లలో చంద్రబాబు పేర్కొన్నారు.

Andhra Pradesh
cm
Chandrababu
tweets
  • Loading...

More Telugu News