gorantla madhav: గోరంట్ల మాధవ్ కు షాక్.. ఆయన భార్యకు టికెట్ దక్కే అవకాశం

  • మాధవ్ రాజీనామాను ఇంకా ఆమోదించని ప్రభుత్వం
  • హిందూపురం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా టికెట్   
  • మాధవ్ భార్య, రిటైర్డ్ జడ్జి కిష్టప్పల పేర్లను పరిశీలిస్తున్న హైకమాండ్

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి ఇరు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన సీఐ గోరంట్ల మాధవ్ కు షాక్ తగిలింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. హిందూపురం లోక్ సభ టికెట్ ను ఆయనకు వైసీపీ అధినేత జగన్ కేటాయించారు. ప్రచారంలో కూడా మాధవ్ దూసుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలైన టెన్షన్ ఇప్పుడే మొదలైంది.

వీఆర్ఎస్ కోసం మాధవ్ చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. దీంతో, ప్రభుత్వ అధికారిగానే ఆయన ఇంకా కొనసాగుతున్నట్టు లెక్క. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో, వైసీపీ హైకమాండ్ దీనిపై సీరియస్ గా ఆలోచిస్తోంది. మాధవ్ స్థానంలో ఆయన భార్యతో పాటు, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప పేర్లను పరిశీలిస్తోంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

gorantla madhav
ysrcp
hindupur
nomination
  • Loading...

More Telugu News