saidharam tej: మెగా హీరోకి ఈ సారి హిట్ ఖాయమట

  • ప్రేమకథా చిత్రంగా 'చిత్రలహరి'
  • హైలైట్ గా నిలవనున్న సునీల్ కామెడీ 
  • ఏప్రిల్ 12వ తేదీన విడుదల        


సాయిధరమ్ తేజ్ హీరోగా .. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతు రాజ్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే దేవిశ్రీ స్వరకల్పనలో తాజాగా వదిలిన 'పరుగు పరుగు' లిరికల్ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

విజయ్ పాత్రలో సాయిధరమ్ తేజ్ చేసే లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్, సునీల్ కామెడీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 'సరిగమ సినిమాస్' వారు ఓవర్సీస్ లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గతంలో ఓవర్సీస్ లో వీళ్లు డిస్ట్రిబ్యూట్ చేసిన 'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

saidharam tej
kalyani priyadarshan
niveda
  • Loading...

More Telugu News