aadi pinisetty: హీరోగా ఆది పినిశెట్టి .. కీలకమైన పాత్రలో హన్సిక .. కొత్త సినిమా లాంచ్

  • ఆది పినిశెట్టి హీరోగా తమిళ సినిమా
  • దర్శకుడిగా మనోజ్ దామోదరన్
  • తెలుగులోనూ రిలీజ్ చేసే ఛాన్స్   

ఒక వైపున విలన్ పాత్రలను .. కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున హీరోగా వచ్చిన అవకాశాలను కూడా ఆది పినిశెట్టి సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే అటు విలన్ పాత్రలైనా .. ఇటు హీరో పాత్రలైనా కొత్తదనం ఉంటేనే ఆయన ఒప్పుకుంటాడు. ఆయన చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.

తాజాగా హీరోగా ఆయన మరో సినిమాను అంగీకరించాడు. ఈ సినిమాకి 'పార్ట్ నర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఆర్ ఎఫ్ సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాకి మనోజ్ దామోదరన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కీలకమైన పాత్రలో హన్సిక నటిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా మొదలుపెట్టేయనున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయి.

aadi pinisetty
hansika
  • Loading...

More Telugu News