Andhra Pradesh: కర్నూలులో మిస్టరీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

  • జిల్లాలోని నందికొట్కూరులో ఘటన
  • ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రుల ఆత్మహత్య
  • ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కుటుంబం

ఆర్థిక కష్టాలో లేక అనారోగ్యమో.. ఓ కుటుంబం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు ఊరివేసిన దంపతులు, తామూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు బుడగజంగం కాలనీలో వీరాంజనేయులు (35), వసంత(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె రామలక్ష్మీ(7), కుమారుడు రాజేశ్(5) ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో వీరాంజనేయులు దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కన్నబిడ్డలకు ఉరివేసి చంపేశారు. అనంతరం వీరిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు

అయితే ఇంట్లో నుంచి దంపతులు బయటకు రాకపోవడంతో ఇరుపొరుగువారు కిటికీ నుంచి తొంగిచూడగా, వీరంతా విగతజీవులుగా కనిపించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh
Kurnool District
suicide
hang
  • Loading...

More Telugu News