Andhra Pradesh: జగన్.. కేసీఆర్ తో జతకట్టి ఏపీ ప్రజల భవిష్యత్ ను తాకట్టు పెడతావా?: మంత్రి నక్కా ఆగ్రహం

  • వైసీపీ అధినేత తన బాధ్యతలను విస్మరించారు
  • కేసీఆర్ తో చేతులు కలపడం దారుణం
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ బాధ్యతలను విస్మరించారని ఆరోపించారు. సాగర్ నుంచి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న కేసీఆర్ తో చేతులు కలపడం దారుణమని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో నక్కా మాట్లాడారు.

అసలు ఏపీ అసెంబ్లీకి రాని జగన్ కు ఓటు ఎందుకు వేయాలని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ తో జతకట్టి ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడతావా? అని జగన్ ను మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
nakka
Jagan
KCR
Telangana
  • Loading...

More Telugu News