Nara Lokesh: ప్రచారంలో ప్రమాదం నుంచి తప్పించుకున్న నారా లోకేశ్

  • నిడమర్రులో ప్రసంగిస్తుండగా కూలిన హోటల్ బోర్డు
  • కార్యకర్తలకు స్వల్ప గాయాలు
  • ఊపిరి పీల్చుకున్న నేతలు

ఏపీ మంత్రి నారా లోకేశ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న ఆయన విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నిడమర్రులో పర్యటించిన ఆయన ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా హోటల్‌కు సంబంధించిన బోర్డు ఒకటి కుప్పకూలింది. అయితే, అది లోకేశ్ పక్కనే కూలడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కార్యకర్తల మీద పడినప్పటికీ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోర్డు కూలిన సమయంలో లోకేశ్ పక్కనే గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, పలువురు ముఖ్యనేతలు కూడా అక్కడే ఉన్నారు.  

Nara Lokesh
Nidamarru
Canvassing
Telugudesam
Mangalagiri
Andhra Pradesh
  • Loading...

More Telugu News