YS Vivekananda reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరొకరి అరెస్ట్.. కడపకు తరలింపు

  • పోలీసుల అదుపులో దిద్దెకుంట శేఖర్‌‌
  • విచారణ అనంతరం కడపకు తరలింపు
  • దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు

మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోని లక్ష్మీ థియేటర్ వెనక వీధిలో సోమవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు పెద్దసోమప్పగారి చంద్రశేఖర్‌రెడ్డి (దిద్దెకుంట శేఖర్‌‌)ని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో అతడిని విచారించిన అనంతరం కడపకు తరలించారు. ఇదే కేసులో మంగళవారం మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి అనుచరులని పోలీసులు తెలిపారు.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకా డ్రైవర్ నుంచి ఆయనకు సన్నిహితంగా ఉండే అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అందరినీ విచారిస్తూ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరోవైపు వైఎస్ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

YS Vivekananda reddy
Kadapa District
Pulivendula
murder
Police
Andhra Pradesh
  • Loading...

More Telugu News