Nizamabad District: లక్ష్మణ్ గారూ! మీరు డూప్లికేట్ హిందువులు: సీఎం కేసీఆర్ విమర్శలు

  • మీరేమో రాజకీయ హిందుత్వ
  • మాది నిజమైన హిందుత్వ
  • మాది దేవుడిని నమ్మే, ఆధ్యాత్మిక హిందుత్వ

నిజామాబాద్ లో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ,  ‘మీరేమో రాజకీయ హిందుత్వ. మాది నిజమైన హిందుత్వ. మేము దేవుడిని నమ్మే, ఆధ్యాత్మిక హిందుత్వ. లక్ష్మణ్ గారూ! మీరు డూప్లికేట్ హిందువులు. ఇక మీ ఆటలు చాలారోజులు సాగవు. ఫలానా వాళ్లను తిట్టమని మన వేదాలు, భగవద్దీత ఎక్కడా చెప్పలేదు.

మీ ఓట్ల రాజకీయాల కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతున్నారు. ఒక యాగం చేసినా, పూజ చేసినా చివర్లో ఏం చెబుతారు.. సమస్త లోకంలో ఉండే జీవరాశి సంతోషంగా ఉండాలని చెబుతారు. ‘ముస్లింలను తిట్టు, క్రైస్తవులను తిట్టు’ అని మీరు చెప్పే రాజకీయం ఇదా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.

Nizamabad District
TRS
cm
kcr
kavitha
laxman
bjp
Telangana
Hindutva
vedas
  • Loading...

More Telugu News