MS Beg: విజయవాడ పశ్చిమలో వైసీపీ కీలక నేత రాజీనామా!

  • జగన్‌ను కలిసేందుకు 20 సార్లు ప్రయత్నించాం
  • అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు
  • ముస్లింలకు సీటు కేటాయిస్తామని మోసం చేశారు

వైసీపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఎంఎస్ బేగ్ నేడు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేగ్ మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ను కలిసేందుకు తాము దాదాపు 20 సార్లు ప్రయత్నించామని.. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ సీటును ముస్లింలకు కేటాయిస్తానని చెప్పి, మోసం చేశారని విమర్శించారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతానికి విజయవాడ పశ్చిమలో ముస్లింలు ఎంతగానో శ్రమించారని, 9 జిల్లాల్లో మైనారిటీలకు ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించడం చూస్తుంటేనే వైసీపీలో మైనారిటీలకు స్థానం లేదని అర్థమవుతోందని బేగ్ పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

MS Beg
YSRCP
Jagan
Vijayawada
Muslims
BJP
RSS
  • Loading...

More Telugu News