modi: మోదీ మరోసారి ప్రధాని అయితే.. భారత్ లో మళ్లీ ఎన్నికలు జరగవు: అశోక్ గెహ్లాట్

  • చైనా, రష్యా బాటలో భారత్ కూడా పయనిస్తుంది
  • అధికారంలోకి రావడానికి మోదీ ఏమైనా చేస్తారు
  • పాక్ తో యుద్ధానికి కూడా మోదీ సిద్ధమని ప్రజలు అనుకుంటున్నారు

ఈ ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధానిగా అధికారంలోకి వస్తే... భారత్ లో మళ్లీ ఎన్నికలు జరగవని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. చైనా, రష్యా బాటలో భారత్ కూడా పయనిస్తుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రధాని అయితే మన దేశంలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయో, లేదో ఎవరూ చెప్పలేరని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం, ప్రజాస్వామ్యం రెండూ ప్రమాదకర పరిస్థితిలోకి జారుకుంటాయని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయడానికైనా మోదీ వెనుకాడరని చెప్పారు. ప్రధాని కావడం కోసం పాకిస్థాన్ తో యుద్ధానికి కూడా మోదీ సిద్ధమని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

తప్పుడు హామీలను ఇవ్వడంలో మోదీ సిద్ధహస్తుడని గెహ్లాట్ విమర్శించారు. బాలీవుడ్ నటుల కంటే మోదీ బాగా నటిస్తారని అన్నారు. అసత్యానికి, సత్యానికి ఉన్న తేడా ప్రజలకు తెలుసని... చివరకు సత్యమే గెలుస్తుందని చెప్పారు.

modi
bjp
ashok gehlot
Rajasthan
congress
  • Loading...

More Telugu News