dadi veerabhadra rao: దాడి వీరభద్రరావును ప్రధాన కార్యదర్శిగా నియమించిన జగన్

  • అననకాపల్లి టికెట్ ను ఆశించి నిరాశకు గురైన దాడి
  • పార్టీని వీడుతారంటూ ప్రచారం
  • దాడితో పాటు ఆయన కుమారుడికి పార్టీ పదవులు ఇచ్చిన జగన్

మాజీ మంత్రి దాడి వీరభద్రరావును వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో దాడి కుమారుడు రత్నాకర్ ను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఈ విషయాన్ని వీరభద్రరావుకు జగన్ స్వయంగా ఫోన్ చేసి తెలియజేసినట్టు సమాచారం.

అనకాపల్లి వైసీపీ టికెట్ ను దాడి వీరభద్రరావు ఆశించారు. అయితే టికెట్ కేటాయించకపోవడంతో... వైసీపీలో దాడి కుటుంబం కొనసాగుతుందా, లేదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. వైసీపీని వీడుతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను పార్టీ పదవుల్లో నియమించడం ద్వారా సమస్యకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు.

dadi veerabhadra rao
jagan
ysrcp
  • Loading...

More Telugu News