sensex: వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 11,500 మార్క్ దాటిన నిఫ్టీ

  • గత డిసెంబర్ తర్వాత ఇన్ని రోజులపాటు ర్యాలీ కొనసాగడం ఇదే ప్రథమం
  • 268 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • మార్కెట్లకు ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్ల అండ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి. వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. 2018 డిసెంబర్ తర్వాత ఇన్ని రోజుల పాటు ర్యాలీ కొనసాగడం ఇదే మొదటిసారి. మరోవైపు నిఫ్టీ గత సెప్టెంబర్ 14 తర్వాత తొలిసారి 11,500 మార్కు పైన ముగియడం కూడా ఈరోజే తొలిసారి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల దూకుడుతో ఈరోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 268 పాయింట్లు ఎగబాకి 38,363కు చేరుకుంది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 11,532 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.45%), ఎన్టీపీసీ (2.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.18%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.05%), భారతీ ఎయిర్ టెల్ (1.81%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-2.10%), ఎల్ అండ్ టీ (-1.60%), మారుతి సుజుకీ (-1.13%), బజాజ్ ఆటో (-0.77%), కోల్ ఇండియా (-0.47%).

  • Loading...

More Telugu News