telangana: తెలంగాణ డీజీపీపై హైకోర్టులో పిటిషన్

  • డీజీపీగా మహేందర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
  • యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని ఆరోపణ
  • సమాధానం ఇవ్వాలంటూ టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డీజీపీగా ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ విజయ్ గోపాల్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. యూపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా మహేందర్ రెడ్డి నియామకం జరగలేదంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... పిటిషనర్ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

telangana
dgp
mahender reddy
High Court
  • Loading...

More Telugu News